అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ పట్టణ మేయర్ ఎరిక్ గార్సెట్టీ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాయబారి పదవికి వివిధ అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నా.. గార్సెట్టీ పేరు ముందువరుసలో ఉన్నట్లు యాక్సియెస్ అనే వార్తా సంస్థ వెల్లడించింది.
దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో అమెరికా రాయబారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయబారి నియామకానికి సంబంధించి అభ్యర్థుల జాబితాను అధికారులు బైడెన్‌కు మార్చిలోనే సమర్పించినా.. అధ్యక్షుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.