అమెరికా జాతీయ భద్రతకు రష్యాతో ముప్పు పొంచి ఉందని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికాకు అతిపెద్ద పోటీదారు చైనాయేనని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.
"నా వరకు.. అమెరికా భద్రతకు రష్యాతోనే ముప్పు. చైనా మనకు అతిపెద్ద పోటీదారు. అయితే ఈ పోటీపై మన వైఖరి బట్టే పరిస్థితులు దేనికి తారి తీస్తాయనేది తెలుస్తుంది."
--- జో బైడెన్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి.