బైడెన్ పరిపాలన విభాగంలో మరో ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు చోటు లభించింది. నేర-న్యాయ విషయాల్లో అధ్యక్షుని ప్రత్యేక సలహాదారుగా చిరాగ్ బెయిన్స్ నియమితులవగా.. కార్మిక విషయాల్లో ప్రత్యేక సలహాదారుగా ప్రొనీతా గుప్తాలు వ్యవహరించనున్నారు.
బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు - భారతీయ అమెరికన్లు
బైడెన్ పాలన యంత్రాంగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. పలు ప్రభుత్వ విభాగాల్లో 20 మందికిపైగా అదనపు సిబ్బంది నియామకాల్లో భాగంగా వారికి అవకాశం లభించింది.
బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు
జాతీయ ఆర్థిక మండలి, దేశీయ విధాన మండలి, దేశీయ వాతావరణ విధాన కార్యాలయం, శ్వేతసౌధం కొవిడ్ ప్రతిస్పందన బృందం వంటి విభాగాల్లో 20 మందికిపైగా అదనపు సిబ్బంది నియమితులయ్యారు. దీనిలో భాగంగా బెయిన్స్, గుప్తాలు కీలక పదవులకు ఎంపికయ్యారు.
ఇదీ చూడండి:'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చైనా దూకుడుకు నిదర్శనం'