అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బైడెన్ ప్రభుత్వం మెక్సికోవైపు సరిహద్దులను మూసివేసింది. అయితే ఈ కారణంగా మానవీయ, రాజకీయ సవాళ్లు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
పరిస్థితులను అదుపు చేయడానికి అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి అలెజాండ్రో మేయర్కోస్ స్వయంగా అక్కడికి వెళ్లారు. మొత్తం కుటుంబంతో వచ్చినవారిని, ఒంటరిగా వచ్చిన పురుషులను అక్కడ నుంచి తిప్పి పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే యువకులు, ఇబ్బంది పడుతున్న పిల్లలను మాత్రం పంపించడం లేదని తెలిపారు.