భారత్‌కు ఆరు పీ-8ఐ నిఘా విమానాలను విక్రయించే ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జో బైడెన్ అధికార యంత్రాంగం కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది. ప్రతిపాదిత విమానాల విక్రయ ప్రక్రియ వల్ల అమెరికా-భారత్ వ్యూహాత్మక బంధం బలోపేతమై.. విదేశాంగ విధానానికి, జాతీయ భద్రతకు మద్దతు లభిస్తుందని ఈ సంస్ధ తెలిపింది.
అతి పెద్ద రక్షణ భాగస్వామి అయిన భారత్ భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొంది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్ధిరత, శాంతి, సహకారం నెలకొనడంలో భారత్ కీలక శక్తిగా కొనసాగుతోందని కాంగ్రెస్‌కు ఇచ్చిన సమాచారంలో అమెరికా రక్షణ సహకార సంస్ధ అభిప్రాయపడింది. అమెరికా నుంచి ఆరు పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2.42 బిలియన్ డాలర్లు ఖర్చు కావొచ్చని అంచనా.