కరోనాను కట్టడి చేయడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అని పలుమార్లు స్పష్టం చేశారు అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్. ఆ దిశగానే ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నారు.
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా.. తొలి 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు బైడెన్. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి కార్యచరణ ప్రణాళికపైనే ఆయన తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు.
విద్యాసంస్థలు తెరవడమే లక్ష్యంగా..
విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు సరిపడా నిధుల్ని కాంగ్రెస్ అందించాలని కోరారు బైడెన్. అలా అయితే, తన 100 రోజుల పాలన పూర్తయ్యే నాటికి విద్యా సంస్థలన్నీ తెరిచేందుకు కృషి చేస్తామన్నారు. మాస్కులు ధరించేలా చూడడం, వ్యాక్సినేషన్, స్కూళ్ల పునఃప్రారంభమే తన తొలి 100 రోజుల పాలనలో కీలక లక్ష్యాలని తెలిపారు.
ఈ లక్ష్యాలని చేరుకున్నప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా ఉంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. తన ముందుకు చాలా కిష్లమైన సవాళ్లున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తన మూడు లక్ష్యాలను చేరుకుంటే మహమ్మారిపై దాదాపు విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డారు.
బైడెన్ బృందం లక్ష్యాలు..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ముందు మరికొన్ని లక్ష్యాలున్నాయి. ప్రాథమిక లక్ష్యాల తర్వాత.. ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులపైనా నూతన అధ్యక్షుడు దృష్టిపెట్టనున్నారు.
పట్టాలపైకి ఆర్థికం..
కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టనున్నారు బైడెన్. కొవిడ్ ఉపశమన బిల్లు పేరిట దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.
పారిస్ ఒప్పందం..
బైడెన్ మళ్లీ పారిస్ ఒప్పందంలో అమెరికాను భాగం చేయనున్నారు. నవంబర్ 4నే ఈ ఒడంబడిక నుంచి వైదొలిగింది అగ్రరాజ్యం.
ఇరాన్‌పై ఆంక్షలు..