తెలంగాణ

telangana

ETV Bharat / international

'నెట్​ఫ్లిక్స్' నిర్మాతలుగా ఒబామా దంపతులు బిజీ - నిర్మాతలు

నెట్​ఫ్లిక్స్​ కోసం ఏడు సినిమాలు, సిరీస్​లు నిర్మించనున్నట్లు ప్రకటించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా, మిషెల్ దంపతులు. సినిమాలపై ఆసక్తితో గతేడాది 'హయ్యర్​ గ్రాండ్ ప్రొడక్షన్' అనే నిర్మాణ సంస్థను స్థాపించారు వీరు.

ఒబామా దంపతులు

By

Published : May 1, 2019, 2:23 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా, ఆయన భార్య మిషెల్​ ఒబామా... సినీ నిర్మాతలుగా ఇకపై బిజీగా గడపనున్నారు.

సినిమాలపై ఆసక్తితో స్థాపించిన 'హయ్యర్​ గ్రాండ్​ ప్రొడక్షన్​' త్వరలో నిర్మించబోయే సినిమాల వివరాలు వెల్లడించారు. 7 సినిమాలు, సిరీస్​లు తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

ఇవి వినోదాన్ని మాత్రమే కాక విజ్ఞానాన్నీ అందించేలా, అందరినీ ప్రభావితం చేసేలా ఉంటాయని చెప్పారు ఒబామా దంపతులు.

సినిమాలు, సిరీస్​ల ప్రదర్శన కోసం ఆన్​లైన్​ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​తో గతేడాది ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

కథాంశాలు ఇవే...

అమెరికా సామాజిక సంస్కర్త ఫ్రెడ్రిక్​ డగ్లస్​ జీవిత చరిత్రకు డేవిడ్ బ్లైట్స్​ అక్షర రూపం ఇచ్చారు. ఆ రచన ప్రఖ్యాత పులిట్జర్​ పురస్కారం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీయనున్నారు ఒబామా దంపతులు.

ప్రపంచానికి పెద్ద తెలియని ప్రముఖులను పరిచయం చేసేందుకు న్యూయార్క్ టైమ్స్​ పత్రిక "ఒవర్​లుక్డ్ " పేరిట ఓ కాలమ్​ ప్రచురిస్తోంది. దీని ఆధారంగా మరో సీరిస్​ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు ఒబామా.

మరికొన్ని సామాజిక అంశాలతో సినిమాలు, షోలు తీయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details