అమెరికాలోని దక్షిణ లూసియానాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్బాల్ క్రీడాకారులతో వెలుతోన్న మినీ విహాంగం నగరంలోని పోస్టాఫీసు పరిసరాల్లో కుప్పుకూలింది. మంటలు చెలరేగి అక్కడ ఉన్న కారు, విమానం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు పోస్టాఫీసు సిబ్బంది, ఒకరు రోడ్డుపై ఉన్న వ్యక్తి ఉన్నారు.
కుప్పకూలిన ఫుట్బాల్ క్రీడాకారుల విమానం.. ఐదుగురు మృతి
అమెరికా దక్షిణ లూసియానాలో ఓ మినీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు విహాంగంలో ఉన్నారు. కళాశాల ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో లుసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయ ఫుట్బాల్ జట్టు కోఆర్డినేటర్ కుమారుడు ఉన్నారు.
కుప్పకూలిన ఫుట్బాల్ క్రీడాకారుల విమానం.. ఐదుగురి మృతి
కళాశాల ఫుట్బాల్ పోటీలకు వెళ్తూ..
కళాశాల ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు లూసియానా నుంచి అట్లాంటాకు బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో లూసియానా స్టేట్ యూనివర్సిటీ ఫుట్బాల్ టీం కోఆర్డినేటర్ కుమారుడు స్టీవెన్ ఎన్స్మింగెర్ జూనియర్ ఉన్నారు. అట్లాంటలో ఎల్ఎస్యూ, ఓక్లాహోం జట్ల మధ్య పోటీ కోసం క్రీడాకారులు వెళుతున్నారు.
Last Updated : Dec 29, 2019, 7:09 AM IST