బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో శనివారం ప్రమాదవశాత్తు ఫెర్రీ ఢీకొనడం వల్ల ఓ వంతెన కూలింది. వారధిపై ఉన్న రెండు కార్లు మోజూ నదిలో పడిపోయాయి.
చిన్న పడవ ఢీకొని కూలిన భారీ వంతెన - పడవ
పడవ ఢీకొని వంతెన కూలిన ఘటన బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నదిలో పడిపోయాయి. బాధితులను రక్షించడానికి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
పడవ ఢీకొని కూలిన వంతెన
బెలూమ్ నగర సమీపంలోని ఈ వంతెన నిత్యం రద్దీగా ఉంటుంది. శనివారం వేగంగా వస్తున్న ఓ పడవ వంతెన స్తంభాన్ని బలంగా ఢీకొంది. క్షణాల్లోనే వంతెన కూలిపోయింది. నదిలో పడిపోయిన కారుల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. బాధితులను రక్షించడానికి ఐదుగురు స్కూబా డైవర్స్ ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: 'షాదీ వద్దు గురూ- సోలో లైఫే సో బెటరూ'
Last Updated : Apr 7, 2019, 9:36 AM IST