పండ్ల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలంటూ అర్జెంటీనాలో రైతులు దేశ రాజధానిలో నిరసన చేపట్టారు. బ్యూనస్ ఎయిర్స్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఎదుట ప్రజలకు పియర్స్, యాపిల్, నారింజ పండ్లను ఉచితంగా పంచి నిరసన తెలిపారు.
పండ్ల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రత్యేక రాయితీలు కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమైన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, పన్ను రాయితీలను కల్పించాలని అధ్యక్షుడు మరిసియో మాక్రిని అభ్యర్థించారు.