చైనా, రష్యా రూపొందిస్తున్న కొవిడ్-19 టీకాలను కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. విస్తృతంగా క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే ముందుగానే మార్కెట్లో విడుదల చేసే ఈ వ్యాక్సిన్లతో ప్రమాదమని భావిస్తోంది. అవి సురక్షితమో కాదో తెలియదని ఆందోళన చెందుతోంది.
కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్-19 ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు కావడం వల్ల ఆ సంస్థ అధినేత డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రియేసస్ మీడియాతో ఈ విధంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల స్థాయిలో పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలున్న దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనని అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు.