లాక్డౌన్ వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేదలు తమ జీవితాలను నిలుపుకోవడం కోసం శ్రమిస్తున్నట్లు పేర్కొంది అంతర్జాతీయ కార్మిక సంస్థ. కెన్యా నుంచి అర్జెంటీనా వరకు శ్రామికులు ఇప్పటికే అందుతున్న తక్కువ వేతనాలతో అరకొర జీవనం సాగిస్తుండగా.. లాక్డౌన్లో మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 3.3 బిలియన్లుగా ఉన్న కార్మికుల్లో.. ఐదుగురిని నమూనాగా తీసుకుంటే నలుగురి పనిస్థలాలను మూసివేశారని వెల్లడించింది సంస్థ. అనధికారికంగా మరో 1.6 బిలియన్ల కార్మికుల జీవనం.. పనులు మూసివేసిన కారణంగా ప్రమాదంలో పడినట్లు పేర్కొంది.
పెరిగిన కష్టాలు..
ఆకలి, పేదరికంతో బాధపడే కుటుంబాలు ఇంతకుముందు సంఖ్యతో పోలిస్తే పెరగినట్లు చెప్పింది. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం చాలామందికి ప్రత్యామ్నాయం కాదని వెల్లడించింది సంస్థ. ఒక పూట భోజనం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి.. ఏదో ఒక పని చేయాల్సి ఉంటుందని తెలిపింది.
'ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు మహమ్మారి ప్రభావం నుంచి ఎంత తొందరగా బయటపడితే.. అంతే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని పేర్కొంది కార్మిక సంస్థ. తద్వారా దేశాలకు కావాలసిన ఆర్థిక సాయం అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు ఉటంకించింది.