తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్ వేరియంట్​పై అమెరికా టీకాలు భేష్'

భారత్​లో ఉత్పరివర్తనం చెందిన బి-1617 రకం కరోనా వైరస్​పై అమెరికాలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆ దేశ వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ స్ట్రెయిన్​ను 'ఆందోళనకర వేరియంట్​'గా డబ్ల్యూహెచ్​ఓ వర్గీకరించింది.

Dr Anthony Fauci
ఆంటోనీ ఫౌచీ

By

Published : May 19, 2021, 10:04 AM IST

భారత్​లో గుర్తించిన కరోనా కొత్తరకం వేరియంట్​ బి-1617పై అమెరికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆ దేశ వైద్యనిపుణులు తెలిపారు.

"మనం వినియోగిస్తున్న వ్యాక్సిన్లు 617 స్ట్రెయిన్​లపైనా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. భారత్​లో గుర్తించిన బి-1617, బి-1618 వేరియంట్లనూ ఈ వ్యాక్సిన్​లు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి."

- ఆంటోనీ ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు

ప్రజలంతా వ్యాక్సిన్​ వేయించుకోవాలన్నారు ఫౌచీ. అమెరికాలో అభివృద్ధి చేసిన టీకాలు భారత వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తాయని కొవిడ్​-19 సీనియర్​ సలహాదారు ఆండీ స్లావిట్ తెలిపారు.

భారత్​లో వెలుగు చూసిన బి-1617 రకాన్ని ఆందోళనకర వేరియంట్​గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఇదీ చదవండి :అప్పటి వరకు టీకా ఎగుమతులు లేనట్లే!

ABOUT THE AUTHOR

...view details