ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమరీ సాధనాన్ని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చిన్నపాటి మెమరీ సాధనాల్లో నిల్వ, సాంద్రతను పెంచేందుకు అవసరమైన భౌతిక శాస్త్ర నియమాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలోని అత్యంత సూక్ష్మమైన రంధ్రాలతో ఆ సామర్థ్యాన్ని సాధించొచ్చని తేల్చారు.
" ఆ నానో రంధ్రంలోకి ఒక లోహపు పరమాణువును ప్రవేశపెట్టాలి. ఫలితంగా ఆ పరమాణువు తన విద్యుత్ వాహక సామర్థ్యంలోని కొంత భాగాన్ని నిల్వ సాధనానికి కట్టబెడుతుంది. ఆ పరికరంలోని డేటా నిల్వ సామర్థ్యం పెరగడానికి ఇది దోహదపడుతుంది" అని పరిశోధనలో పాలు పంచుకున్న దేజి అకిన్వాండే చెప్పారు.