తెలంగాణ

telangana

ETV Bharat / international

241 మంది భారతీయుల్ని దత్తత తీసుకున్న అమెరికన్లు! - kids adoption news

భారత్​లోని 241 మంది చిన్నారులను అమెరికన్ కుటుంబాలు గతేడాది దత్తత తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దత్తతలు ఆగడం లేదని పేర్కొన్నారు.

American families adopted 241 Indian kids in 2019: Report
241 మంది భారత చిన్నారులను దత్తత తీసుకున్న అమెరికన్లు

By

Published : May 7, 2020, 3:23 PM IST

ఇతర దేశాల నుంచి 2019లో తమ దేశస్థులు దత్తత తీసుకున్న చిన్నారుల వివరాలను వెల్లడించింది అమెరికా విదేశాంగ శాఖ. 12వ వార్షిక నివేదికలో వీటిని పొందుపర్చింది. వివరాల ప్రకారం భారత్​లోని 241 మంది చిన్నారులను అమెరికన్ పౌరులు దత్తత తీసుకున్నారు. ఇందుకు సంబంధించి 2019లో మొత్తం 2,971 ఇమ్మిగ్రేషన్​ వీసాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

గతంతో పోల్చితే అమెరికన్ కుటుంబాలు ఇతర దేశాల నుంచి దత్తత తీసుకోవడం తగ్గినట్లు చిన్నారుల సమస్యలకు సంబంధించిన ప్రత్యేక సలహాదారు మిచేలీ బెర్నిర్​ టోత్ చెప్పారు. ముఖ్యంగా చైనా నుంచి దత్తతలు 656 తగ్గగా, ఇథియోపియాలో ఆ సంఖ్య 166గా ఉంది. ఆ దేశాలు న్యాయపరమైన మార్పులు చేయడం వల్లే సంఖ్య తగ్గినట్లు వివరించారు.

ఇతర దేశాల నుంచి దత్తతలు తగ్గడానికి ఆయా దేశాలు స్వదేశంలోని వారికే ప్రాధన్యమివ్వడం మరో కారణమని మిచేలీ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో మాత్రం దత్తతలు పెరిగినట్లు చెప్పారు. ఉక్రెయిన్​లో 50, లిబేరియాలో 21, హంగేరీలో 17, కొలంబియాలో 15 మందిని గతంతో పోల్చితే ఎక్కువగా అమెరికన్లు దత్తత తీసుకున్నారు.

చైనీయులే అధికం..

అయితే అమెరికన్లు దత్తత తీసుకునే వారిలో అత్యధికంగా చైనీయులే ఉన్నారు. 2019లో ఆ దేశం నుంచి 819మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉక్రెయిన్ 298, కొలంబియా 244, భారత్​ 241 ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దత్తతలు మాత్రం ఆగడం లేదని మిచేలీ వెల్లడించారు.

2019 నివేదిక ప్రకారం అమెరికా నుంచి 56 మంది చిన్నారులను ఇతర ఏడు దేశాల వారు దత్తత తీసుకున్నారు. కెనడా 24, నెదర్లాండ్స్​ 17, మెక్సికో 6, ఐర్లాండ్ 5, బెల్జియం, స్విట్జర్లాండ్​ ఒక్కొక్కరిని, బ్రిటన్ ఇద్దరిని దత్తత తీసుకున్నాయి.

విదేశాల నుంచి దత్తత ప్రక్రియ ముగిసేందుకు అత్యధికంగా పెరూలో 899 రోజులు పడుతుంది. భారత్​లో ఈ ప్రక్రియ 457 రోజుల్లోనే పూర్తవుతుందని నివేదిక పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details