అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన 48వ 'సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్'లో దాదాపు వెయ్యి కిలోల గుమ్మడికాయ బహుమతిని గెలుచుకుంది. 994 కిలోలున్న ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్.. దాదాపు 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. 2017లో జెఫ్ మూడో స్థానంలో నిలిచాడు.
వెయ్యి కిలోల గుమ్మడికాయ.. చూశారా ఎప్పుడైనా?
ఇప్పటివరకు వివిధ రకాల గుమ్మడికాయలను చూశాం. పలు ఆకారాలు, రంగుల్లో ఉన్నవాటిని చూసి అబ్బురపడ్డాం. అయితే.. ప్రపంచంలోనే అత్యంత భారీ గుమ్మడికాయల గురించి విన్నారా? ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు వెయ్యి కిలోలు ఉన్న ఈ గుమ్మడికాయలను చూస్తే 'వామ్మో' అనకుండా ఉండలేరు.
గుమ్మడికాయ
సూపర్ బౌల్‌గా పిలిచే ఈ పోటీలను కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. 2020 సంవత్సరానికి గానూ ఉత్తర అమెరికాలో నిర్వహించిన పోటీలో అత్యధికంగా వెయ్యి 66 కిలోల గుమ్మడికాయ బహుమతిని గెలుచుకుంది.
ఇవీ చదవండి: