తెలంగాణ

telangana

ETV Bharat / international

33 శాతం తగ్గిన ఎయిడ్స్​ మృతుల సంఖ్య - aids

ఎయిడ్స్ మృతుల సంఖ్య తగ్గిందని పేర్కొంది ఐక్య రాజ్యసమితి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల 70 వేలమంది హెచ్​ఐవీతో మృతి చెందారని స్పష్టం చేసింది. 2010తో పోల్చితే ఎయిడ్స్ మృతుల సంఖ్య 33 శాతం తగ్గిందని వెల్లడించింది.

33 శాతం తగ్గిన ఎయిడ్స్​ మృతుల సంఖ్య

By

Published : Jul 17, 2019, 8:58 AM IST

33 శాతం తగ్గిన ఎయిడ్స్​ మృతుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 2018లో 7 లక్షల 70 వేలమంది ఎయిడ్స్ కారణంగా మృతి చెందారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. 2010తో పోల్చితే గతేడాది మరణాల్లో 33 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది. వ్యాధి నిర్మూలనకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలు నిధుల లేమి కారణంగా నిలిచిపోయినట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం 3 కోట్ల 70 లక్షల 9 వేల మంది వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని, అందులో 2 కోట్ల 30 లక్షల 3వేల మంది వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది ఐరాస.

వ్యాధి తీవ్రంగా ఉన్న 90వ దశకం మధ్యలో చేపట్టిన నియంత్రణ చర్యలతో ఎయిడ్స్​తో చనిపోయే వారి సంఖ్య 2017 ఏడాదిలో 8 లక్షలకు తగ్గిందని.. గతేడాది ఆ సంఖ్య 7 లక్షల 70 వేలకు చేరుకుందని స్పష్టం చేసింది. 2010లో 12 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా మృతి చెందారు.

ఐరాస గణాంకాల ప్రకారం కొత్తగా వ్యాధి బారిన పడేవారు ఐరోపాలో 29 శాతం ఉండగా, ఉత్తర ఆఫ్రికాలో10 శాతంఉన్నారు.

"ఎయిడ్స్​ నిర్మూలనకు రాజకీయ నేతల చొరవ పెరగాలి"

-గనిల్లా కార్ల్​సన్, కార్యనిర్వాహక కార్యదర్శి, ఐరాస ఎయిడ్స్ కార్యక్రమం

హెచ్​ఐవీకి వాక్సిన్ కనుగొనడానికి దశాబ్దాల నుంచి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. డ్రగ్ వాడకం దారులు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వారి ద్వారానే సగం కంటే ఎక్కువ హెచ్​ఐవీ కేసులు నమోదవుతున్నట్లు ఐరాస తెలిపింది.

ఇదీ చూడండి: 'సభకు హాజరు కాకపోతే మాట్లాడనిచ్చేదే లేదు'

ABOUT THE AUTHOR

...view details