ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి ఎన్నికయ్యాక... ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కోసం ఈ నెలలో భారత్లో పర్యటించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.
ఈ నెలలో భారత్కు అమెరికా విదేశాంగ మంత్రి - అమెరికా
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ నెలలో భారత్కు రానున్నారు. ఎన్డీఏ రెండోసారి అధికారం చేపట్టాక .. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతంపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు.
ఇండో-పసిఫిక్ దేశాలతో అమెరికా వ్యూహాలపై వాషింగ్టన్లో బుధవారం జరిగే సదస్సులో మాట్లాడతానని పాంపియో వెల్లడించారు. ఈ నెల 24న భారత పర్యటనకు పాంపియో బయలుదేరే అవకాశముందని అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ తెలిపారు. భారత్లో పర్యటన తర్వాత ఆయన శ్రీలంక వెళ్లనున్నారు. ఈస్టర్ రోజున ఉగ్రదాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 సదస్సుకు హాజరవుతారని ఓర్టగస్ వెల్లడించారు.
ఇదీ చూడండి :భవనంపై కూలిన హెలికాప్టర్.. పైలట్ మృతి