ఉత్తర కాలిఫోర్నియా లేక్ తహో సమీపంలోని ఓ భవనం ముందున్న చెత్త కంటైనర్లో దిగింది ఓ ఎలుగు పిల్ల. ప్రమాదవశాత్తు దాని మూత పడిపోయి అందులోనే చిక్కుకుంది. తల్లి ఎలుగు, ఇతర ఎలుగు పిల్లలు చెత్త కంటైనర్ మూత తెరిచేందుకు చాలా సేపు ప్రయత్నించాయి. కానీ ఆ బరువైన మూత తెరవడం వాటికి సాధ్యం కాలేదు.
కంటైనర్లో చిక్కిన ఎలుగు పిల్లను కాపాడారిలా! - సామాజిక మాధ్యమాలు
కాలిఫోర్నియాలో ఓ ఎలుగుబంటి పిల్ల చెత్త కంటైనర్లో దిగింది. ప్రమాదవశాత్తు ఆ కంటైనర్ మూత పడిపోయింది. మూత బరువుగా ఉంది. తెరుచుకోలేదు. తోటి ఎలుగుబంట్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అవి అవస్థ పడుతుంటే.. అటుగా వచ్చిన పోలీసులు గమనించారు. చాకచక్యంతో దాన్ని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
కంటైనర్లో చిక్కిన ఎలుగు పిల్ల.. పోలీసులు కాపాడారిలా!
గమనించిన స్థానిక పోలీసులు ఆ మూత తెరిచి, ఓ చిన్న నిచ్చెనను అందులో ఉంచారు. ఆ పిల్ల ఎలుగు నిచ్చెన ఎక్కి బయటకి వచ్చింది. తన కుటుంబంతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి:ఇటలీలో బద్దలైన స్టోమ్బోలి అగ్నిపర్వతం
Last Updated : Sep 28, 2019, 11:17 PM IST