తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికోలో కాల్పుల కలకలం- 9మంది మృతి - మెక్సికో

మెక్సికోలోని ఓ వీడియో కేంద్రం​పై నలుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

9 killed, including 3 kids, at video game arcade in Mexico
మెక్సికోలో కాల్పుల కలకలం- 9మంది మృతి

By

Published : Feb 4, 2020, 9:47 PM IST

Updated : Feb 29, 2020, 4:55 AM IST

మెక్సికోలోని ఉరౌపన్​లో​ నలుగురు దుండగులు కలకలం సృష్టించారు. ఓ వీడియో కేంద్రం​ వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు(12,13,14ఏళ్లు) ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

కొందరిని వెతుకుతూ వీడియో కేంద్రం​ వద్దకు వచ్చిన ఆగంతకులు.. వినియోగదారులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

మెక్సికోలో డ్రగ్​ డీలర్​ అసోసియేషన్​లోని కొన్ని వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఆధిపత్య పోరులో అనేక మారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Last Updated : Feb 29, 2020, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details