పబ్జీ...! ఆన్లైన్ గేమింగ్‌లో సరికొత్త సంచలనం. తుపాకులు, బాంబులతో బుల్లితెర యుద్ధభూమిని అదరగొడుతూ గంటలుగంటలు గడిపేస్తోంది యువత. కొందరైతే "విన్నర్ విన్నర్... చికెన్ డిన్నర్" అని అనిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చీట్ కోడ్స్ వాడుతున్నారు.
ఆటో ఎయిమింగ్, చీటింగ్ టూల్స్, వర్చువల్ టూల్స్, మోడిఫైడ్ ఇన్-గేమ్ డేటాతో దొంగ ఆట ఆడుతున్నవారిపై గురిపెట్టారు పబ్జీ నిర్వాహకులు. 'క్రీడా స్ఫూర్తి'ని దెబ్బతీసే అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించరాదని నిర్ణయించారు. అందుకే సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు.