కొవిడ్-19 వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కీలక ప్రకటన చేసింది. అధ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అస్వస్థతకు లోనవండ వల్ల వ్యాక్సిన్‌పై మూడో దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏ క్లినికల్ ట్రయల్స్‌లో అయినా తీవ్ర ప్రతికూల ఘటనలు ఊహించదగినవేనని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అధ్యయనాన్ని నిలిపేసి వైఫల్యానికి గల కారణాలేమిటో పరిశీలించి మానవులపై పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది.
వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన 'జాన్సన్ అండ్ జాన్సన్' - కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ అప్డేట్స్
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది. పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అస్వస్థతకు లోనవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వైఫల్యానికి గల కారణాలేమిటో పరిశీలించి మానవులపై పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది.
జాన్సన్ సంస్థ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత
మరోవైపు రోగుల భద్రతా కమిటి సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఈ ఘటనతో 60 వేల మందిని క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వ్యవస్థను మూసివేశారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60 వేల మంది వలంటీర్లపై భారీగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది.