మొదటి ప్రైవేట్ అంతరిక్షయాత్ర వచ్చే జనవరిలో ప్రారంభం కానుంది. ముగ్గురు వ్యక్తులతో కూడిన ఈ బృందానికి నాసా మాజీ వ్యోమగామి నేతృత్వం వహించనున్నారు. అయితే వీరు స్పేస్‌కి వెళ్లేందుకు హ్యోస్టన్కు చెందిన ఆక్సియం సంస్థ భారీగానే వసూలు చేస్తోంది. ఒక్కొక్కరికి నుంచి 55 మిలియన్ డాలర్లు (రూ.401కోట్లు) వరకు తీసుకోనున్నట్లు సంబంధిత కంపెనీ మంగళవారం ప్రకటించింది.
అయితే ఇలాంటి ప్రైవేటు వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇదే మొదటిసారి అని ఆక్సియం సంస్థ అధ్యక్షుడు మైక్ సుఫ్రేది తెలిపారు. మైక్ నాసాలో అంతరిక్ష కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్‌గా కొంతకాలం సేవలందించారు. ఈ బృందంలో మిషన్ కామాండర్‌గా మైఖేల్ లోపేజ్ అలెగ్రియాకు అంతరిక్ష ప్రయాణంపై పూర్తి అవగాహన ఉందని మైక్ తెలిపారు. మిగతా ముగ్గురికి ఇది ఓ మంచి అవకాశం అని వ్యాఖ్యానించారు.