ప్రపంచ వ్యాప్తంగా 117 మిలయన్ల మంది చిన్నారులకు తట్టు వ్యాధి పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. దానికి సంబంధించిన టీకా వేసే కార్యక్రమాలను పలు దేశాలు నిలిపివేయడమే తట్టు ప్రబలడానికి కారణమవుతుందని ఐరాస అభిప్రాయపడింది.
ప్రస్తుతం 24 దేశాల్లో తట్టు తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తట్టుకు సంబంధించిన టీకా సరఫరాను నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎన్‌ఐసీఈఎఫ్ సంయుక్తగా ప్రకటించాయి. మరో 13 దేశాల్లో కరోనా వ్యాప్తి కారణంగా టీకా వేసే కార్యక్రమాలకు అడ్డుకట్ట పడిందని తెలిపింది ఐరాస.
ప్రస్తుతం కరోనా ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపతోంది. తట్టు కూడా ప్రాణాంతకరమైన వ్యాధి. దీనికి సంబంధించిన టికా ఇప్పటికి సిద్ధంగా ఉంది. కనుక కరోనా భౌతిక దూరం నిబంధనలు సడలించిన తర్వాత తట్టుకు చెందిన వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని ఆయా దేశాలను కోరుతున్నాను.