తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా తీసుకొని.. ధనవంతులుగా మారి..

కరోనా వ్యాక్సిన్​ వేయించుకుని రోగనిరోధకశక్తి పొందటమే కాక ధనవంతులు కూడా అయ్యారు కొందరు వ్యక్తులు. అవును.. వ్యాక్సిన్​ తీసుకున్నవారిలో 10 మంది అదృష్టవంతులు ఒక్కొక్కరు 1.5 మిలియన్​ డాలర్ల బహుమతి అందుకున్నారు. ఈ లాటరీ కార్యక్రమంలో 2కోట్ల మందికి పైగా టీకా తీసుకున్నవారు పాల్గొన్నారు.

vaccine jackpot california
వ్యాక్సిన్​ జాక్​పాట్

By

Published : Jun 16, 2021, 10:38 AM IST

కరోనా వ్యాక్సినేషన్​ను ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచన చేశారు అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గవీన్​ న్యూసోమ్​. రాష్ట్రంలో కొవిడ్ టీకా తీసుకున్న 10 మంది అదృష్టవంతులకు 15 మిలియన్ డాలర్లు బహుమతిగా అందించారు​. కాలిఫోర్నియాలో కరోనా నిబంధనలను సడలించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవీన్​ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఒక్కొక్కరికి 1.5 మిలియన్ డాలర్లను అందజేశారు. ఈ లాటరీ కార్యక్రమంలో దాదాపు 2 కోట్లమందికిపైగా పాల్గొన్నారు.

బహుమతిని అందిస్తున్న కాలిఫోర్నియా గవర్నర్
లాటరీ విజేతలు వీరే

దేశంలోనే అత్యల్పం..

ప్రజలందరూ టీకాలు వేసుకోవాలన్న ఉద్దేశంతో.. 'వ్యాక్స్​ ఫర్​ ది విన్​' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు గవర్నర్​. ప్రస్తుతం కాలిఫోర్నియాలో.. అమెరికాలోనే అత్యల్ప పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అక్కడ దాదాపు 70 శాతానికి పైగానే వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇదీ చదవండి :టీకా జాక్​పాట్- లక్కీగా వరించిన వ్యాక్సిన్

వ్యాక్సిన్​ తీసుకుంటే కార్లు ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details