తెలంగాణ

telangana

ETV Bharat / international

కోటి 60 లక్షలు దాటిన కరోనా కేసులు - covid-19 cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 60 లక్షలు దాటింది. చైనా, దక్షిణ కొరియాల్లో మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు.. ఆఫ్రికాలో కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఇందులో సగానికిపైగా కేసులు దక్షిణాఫ్రికా దేశంలోనే నమోదయ్యాయి.

total covid-19 cases in the world surpasses one crore 60 lakhs cases
కోటి 60 లక్షలు దాటిన కరోనా కేసులు- చైనాలో మళ్లీ

By

Published : Jul 25, 2020, 9:16 PM IST

కరోనా కాలనాగు ప్రపంచంపై విషం చిమ్ముతోంది. ఈ మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య తాజాగా కోటి 60 లక్షలకు చేరింది. 6.44 లక్షల మంది మరణించారు.

కొవిడ్ ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలమవుతోంది. అమెరికాలో వైరస్ కేసుల సంఖ్య 42.52 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 1,48,541కి ఎగబాకింది. 20.28 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మరో 20.75 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

మళ్లీ పెరుగుదల..

దక్షిణ కొరియాలో కొత్తగా 113 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాక్​ నుంచి తిరిగొచ్చిన 36 మంది కార్మికులు సహా 32 మంది రష్యా సరకు విమాన సిబ్బందికి పాజిటివ్​గా తేలినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

చైనాలో మరో 34 పాజిటివ్ కేసులను గుర్తించారు అధికారులు. ఇందులో 29 మందికి దేశంలోనే సోకినట్లు వెల్లడించారు.

ఎదురుదెబ్బ..

యెమెన్​లో 97 మంది వైద్య సిబ్బంది వైరస్ కారణంగా మరణించారు. ఐదు సంవత్సరాలుగా దేశంలో యుద్ధం జరుగుతుండటం వల్ల ఇప్పటికే యెమెన్​లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఘటన జరగడం ఆ దేశానికి తీరని లోటని మెడ్​గ్లోబల్ సంస్థ పేర్కొంది.

50 వేలకు చేరువలో..

సింగపూర్​లో మరో 513 కరోనా కేసులు బయటపడ్డాయి. వీరంతా విదేశాలకు చెందినవారేనని సింగపూర్ వైద్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కేసుల సంఖ్య 49,888కి చేరింది. ఇప్పటివరకు 45,172 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రెండు వారాల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నేపాల్​లో..

నేపాల్​లో మరో 133 కొవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించారు అధికారులు. మొత్తం కేసుల సంఖ్య 18,374కి చేరినట్లు తెలిపారు. ఓ మహిళ కరోనా బారిన పడి మరణించగా.. ఇప్పటివరకు నేపాల్​లో 44 మంది వైరస్ ధాటికి ప్రాణాలు త్యజించారు.

ఆందోళనకరంగా ఆఫ్రికా

ఆఫ్రికా ఖండంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటింది. మొత్తం 8,10,008 పాజిటివ్ కేసులు రాగా.. ఇందులో సగానికిపైగా దక్షిణాఫ్రికా నుంచే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో 13వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల ఎనిమిది వేలకు ఎగబాకింది. మొత్తం 6,093 మంది వైరస్​ ధాటికి బలైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. కెన్యా సహా తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆఫ్రికాలో వైద్య సేవల పరిమితుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 42,52,490 1,48,541
బ్రెజిల్ 23,48,200 85,385
రష్యా 8,06,720 13,192
దక్షిణాఫ్రికా 4,21,996 6,343
మెక్సికో 3,78,285 42,645
పెరూ 3,75,961 17,843
చిలీ 3,41,304 8,914
స్పెయిన్ 3,19,501 28,432
యూకే 2,97,914 45,677

ABOUT THE AUTHOR

...view details