ప్రపంచంలో టైటానిక్ అంటే తెలియనివారు ఉండరు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌కు దక్షిణాన 596 కి.మి దూరంలో ఈ ఓడ అవశేషాలను సందర్శించింది ఓ జలాంతర్గామి బృందం. గత 14 ఏళ్లలో టైటానిక్ శిథిలాల వద్దకు వెళ్లడం ఇదే తొలిసారి.
జలాంతర్గామి పైలట్ విక్టర్ వెస్కొవొ నేతృత్వంలోని బృందం ప్రత్యేక నౌకలో టైటానిక్‌ను సందర్శించి అధ్యయనం చేసింది. దాని చుట్టూ పేరుకుపోయిన బ్యాక్టీరియాను సేకరించి పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు.
లోహాలను తినే సహజసిద్ధమైన ఈ బ్యాక్టీరియా వల్ల భవిష్యత్తులో టైటానిక్ అవశేషాలు వేగంగా కనుమరుగైపోతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రజ్ఞులు.