తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా ప్రమాణం

దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా ప్రమాణ స్వీకారం చేశారు. అవినీతిపై పోరాడతానని ఆ దేశ కార్యనిర్వాహక రాజధాని ప్రిటోరియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన వాగ్దానం చేశారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

By

Published : May 26, 2019, 2:31 PM IST

సిరిల్ రామఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అవినీతి ఆరోపణలతో జాకబ్ జుమా రాజీనామా చేసిన సందర్భంలో తొలిసారిగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. ఏడాదికాలం పాటు పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో రామఫోసా నేతృత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 57.5 శాతం ఓట్లను సాధించి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది. సమానత్వం, దేశ వనరుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని రామఫోసా ప్రకటించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తున్న అవినీతి, నిర్వహణ లోపాలను సరిచేస్తానని ప్రమాణస్వీకారం సందర్భంగా రామఫోసా హామీ ఇచ్చారు.

పేదరికం, అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలను రూపుమాపేందుకు కృషి చేస్తానని.. ఎన్నికల నినాదంగా రామఫోసా ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా తొమ్మిదేళ్లను వృథా చేశారని, అవినీతి కారణంగా దేశం అనేక అవకాశాలను కోల్పోయిందని తాజా ఎన్నికల్లో ప్రచారం చేశారు.

ఇదీ చూడండి:ఇరుదేశాల వాణిజ్య ఉద్రిక్తతల నడుమ జపాన్​లో ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details