తెలంగాణ

telangana

ETV Bharat / international

మాలీలో ఉగ్రదాడి- ఆరుగురు సైనికులు మృతి - ఆఫ్రికా దేశం మాలీలో ఉగ్రవాదుల దాడి

సెంట్రల్ మాలీలోని రెండు ఆర్మీ పోస్టులపై జరిగిన దాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. 18 మంది జవాన్లు గాయపడ్డారు. బదులుగా తాము చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులు మరణించారని అక్కడి సైన్యం తెలిపింది.

Six Malian soldiers killed in terror attacks in central Mali
మాలీలో ఉగ్రదాడి- ఆరుగురు సైనికులు మృతి

By

Published : Jan 25, 2021, 6:27 AM IST

ఆఫ్రికా దేశం మాలీలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు.

సెంట్రల్ మాలీలోని మోండోరోలో రెండు ఆర్మీ పోస్టులపై ఈ దాడి జరిగిందని అక్కడి సైన్యం తెలిపింది. ఈ దాడిని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని స్పష్టం చేసింది. దాదాపు 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. 40 ద్విచక్రవాహనాలు, పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details