తెలంగాణ

telangana

ETV Bharat / international

కెన్యాను వణికిస్తోన్న వరదలు.. 34 మంది మృతి

కెన్యాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా శనివారం ఒక్కరోజునే 34 మంది మృతి చెందారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది.

కెన్యాను వణికిస్తోన్న వరదలు

By

Published : Nov 23, 2019, 11:51 PM IST

Updated : Nov 24, 2019, 7:20 AM IST

కెన్యాను వణికిస్తోన్న వరదలు
భారీ వర్షాలు, వరదలు పశ్చిమ కెన్యాను అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం ఒకే రోజు కొండచరియలు విరిగిపడి 29 మంది మృతి చెందడం సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
పొకోట్​ సెంట్రల్​ జిల్లాలోని టక్మాల్​ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదే జిల్లాలోని పరువా, టపాచ్​ గ్రామాల్లో బురదలో చిక్కుకుని 12 మంది మరణించారు. పశ్చిమ పోకోట్​ రాష్ట్రంలో రెండు నదులు ఉప్పొంగి కిటేల్​, లోడ్వార్​ నగరాల మధ్య రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు కొట్టుకుపోయింది. కారులోని ఐదుగురు మృతి చెందారు.

రంగంలోకి సైన్యం...

భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. హెలికాఫ్టర్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నెలన్నర వ్యవధిలో 72 మంది మృతి..

గడిచిన నెలన్నర కాలంలో వరదల కారణంగా తూర్పు ఆఫ్రికా దేశంలో సుమారు 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఈ ప్రాంతం తీవ్ర కరువుతో బాధపడుతుండేదని అంతర్జాతీయ విపత్తు స్పందన కమిటీ పేర్కొంది.

మరో 6 వారాలు..

సోమాలియా, దక్షిణ సూడాన్​, కెన్యా దేశాలను వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు. మరో 4-6 వారాల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 76వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాలతో నిరసనలు

Last Updated : Nov 24, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details