తెలంగాణ

telangana

ETV Bharat / international

సైనిక తిరుగుబాటుతో మాలి అధ్యక్షుడి రాజీనామా - mali president resigns

సైనిక తిరుగుబాటు నేపథ్యంలో మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా రాజీనామా చేశారు. సైనికులు నిర్బంధించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు బూబకర్.

MALI PREZ RESIGN
మాలి అధ్యక్షుడి రాజీనామా

By

Published : Aug 19, 2020, 6:52 AM IST

సైనిక నిర్బంధంలో ఉన్న మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్​ కీతా తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ టీవీ ఛానల్​ వేదికగా ప్రకటించారు. తిరుగుబాటు సైనికులు ఆయనను నిర్బంధించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు బూబకర్​.

బూబకర్​ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇస్లాం తిరుగుబాట్లను బూబకర్​ ప్రోత్సహిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కీతా మద్దతుదారులు కూడా ఆయన నుంచి దూరంగా జరిగారు.

ఏడాది కాలంగా ఇస్లామిక్ స్టేట్, ఆల్​ఖైదా అనుబంధ సంస్థలు సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారు. 2019లో ఉత్తర ప్రాంతంలో తీవ్రమైన దాడులు జరిగాయి.

ఇదీ చూడండి:సైన్యం తిరుగుబాటు- దేశాధ్యక్షుడు, ప్రధాని నిర్బంధం!

ABOUT THE AUTHOR

...view details