తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇదాయ్​' మృతులు 500, బాధితులు 4 లక్షలు - 500 died

జింబాబ్వే, మొజాంబిక్​, మాలావి దేశాల్లో ఇదాయ్​ తుపాను తీరని నష్టం మిగిల్చింది. ఇప్పటి వరకు 500 మంది మరణించారు. ఆ దేశాల్లో 4 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

పునారావాస కేెంద్రాల్లో తలదాచుకుంటున్న 'ఇదాయ్' బాధితులు

By

Published : Mar 22, 2019, 10:27 AM IST

'ఇదాయ్​' మృతులు 500, బాధితులు 4 లక్షలు

దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, మాలావి దేశాలు ఇదాయ్​ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. విపత్తు వల్ల ఇప్పటి వరకు 500 మందికిపైగా ప్రజలు మరణించారు.

తుపాను ధాటికి జింబాబ్వేకు చెందిన 120కు పైగా మృతదేహాలు పక్కనే ఉన్న మెజాంబిక్​కు కొట్టుకుపోయాయి. వారిని అక్కడి స్థానికులే ఖననం చేశారని జింబాబ్వే రక్షణ మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకు ఇదాయ్​ కారణంగా జింబాబ్వేలో 259 మంది, మొజాంబిక్​లో 217 మంది, మాలావిలో కనీసం 56 మంది మరణించి ఉంటారని అధికారుల అంచనా.
సెంట్రల్​ మొజాంబిక్​లో వర్షం ధాటికి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరదలు తగ్గినప్పటికీ చాలా ప్రాంతాలు బురదమయం అయ్యాయి.
తుపాను కారణంగా 4లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస ఫుడ్​ ఎయిడ్​ ఏజెన్సీ తెలిపింది.

వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఇంటర్నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ రెడ్ క్రాస్ తెలిపింది. గురువారం ఒక్క రోజే మొజాంబిక్​లోని బెయిరా పట్టణంలో 910 మందిని బోట్లు, హెలికాఫ్టర్ల సహాయంతో రక్షించినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details