ఈజిప్టు తవ్వకాల్లో ఇటీవల బయటపడిన జంతువుల అవశేషాల వివరాలను ఆ దేశ పురావస్తు శాఖ వెల్లడించింది. పిల్లులు, పక్షులు, మొసళ్లు సహా అయిదు సింహం పిల్లల శిలాజాలను తవ్వకాల్లో గుర్తించినట్లు తెలిపింది.
ఈ అవశేషాలు లభించిన నెక్రోపోలిస్కు సమీపంలోని దక్షిణ కైరో, సక్కారాలోని స్టెప్ పిరమిడ్లో జంతువుల మమ్మీలను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో పిల్లుల అవశేషాలను ఎక్కువ సంఖ్యలో గుర్తించినప్పటికీ.. సింహాల శిలాజాలు గుర్తించడం చాలా అరుదైన విషయమని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో పాటు రాతి రూపంలో ఉన్న పేడపురుగు, మరో కీటక అవశేషాలను గుర్తించారు. తవ్వకాల్లో ఇప్పటివరకు లభించిన వాటిలో ఇవే అతి పెద్దవని తెలిపారు.