తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముర్సీ హఠాన్మరణం

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్​ ముర్సీ హఠాన్మరణం చెందారు. కోర్టులో విచారణ సమయంలో స్పృహ తప్పిపడిపోయిన ఆయన కైరో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Jun 18, 2019, 7:57 AM IST

మొర్సీ

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ ముర్సీ మరణించారు. కోర్టులో విచారణ సందర్భంగా మూర్ఛబోయిన ఆయన కైరో ఆసుపత్రిలోసోమవారంప్రాణాలు కోల్పోయారు. ముర్సీ మృతిని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది.

జడ్జి ముందు 20 నిమిషాల పాటు మాట్లాడిన ముర్సీ ఉద్రేకానికి గురై మూర్ఛబోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన మరణించినట్టు తెలుస్తోంది.

30 ఏళ్లపాటు ఈజిప్టును నిరంకుశంగా పరిపాలించిన హోస్ని ముబారక్‌ను 2011లో పదవీచ్యుతుణ్ని చేశారు. అనంతరం 2012లో ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడయ్యారు. 2013లో సైన్యం ముర్సీని దింపేసి, ఆయన రక్షణమంత్రి అల్‌ సిసిని అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టింది.

ఇదీ చూడండి: నైజీరియాలో ఆత్మాహుతి దాడి- 30 మంది బలి

ABOUT THE AUTHOR

...view details