తెలంగాణ

telangana

ETV Bharat / international

సహాయంకోసం 'ఇదాయ్​' బాధితుల ఎదురుచూపులు - ​ఆఫ్రికా

​ఆఫ్రికాలోని మొజాంబిక్​ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది ఇదాయ్​ తుపాను. సహాయక బృందాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వరదల్లో చిక్కుకున్నవారిని శిబిరాలకు చేరవేస్తున్నారు.

సహాయంకోసం 'ఇదాయ్​' బాధితుల ఎదురుచూపులు

By

Published : Mar 24, 2019, 5:21 PM IST

సహాయంకోసం 'ఇదాయ్​' బాధితుల ఎదురుచూపులు
ఆఫ్రికాలోని జింబాబ్వే, మాలావి, మొజాంబిక్​ దేశాలను కుదుపేసింది భయంకర తుపాను 'ఇదాయ్'. విపత్తు వల్ల సుమారు 500 మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తుపాను ప్రభావం తగ్గినా వేల సంఖ్యలో ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నా మొజాంబిక్​లోని చాలా ప్రాంతాలు బురదమయంగానే ఉన్నాయి. వేల కుంటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తమవారి ఆచూకీ తెలియట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొజాంబిక్​ దేశంలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నారు. బూజి ప్రాంతంలో వరదల ధాటికి నిరాశ్రయులైన ప్రజలను స్థానిక మత్స్యకారులు వారి బోట్లలో ఇతర పట్టణాలకు చేరవేస్తున్నారు.

"నా పిల్లలతో ఒంటరిగా ఉన్నా. నా భర్త ఉన్నాడనే నమ్మకంతో ఇక్కడకి వచ్చాను. ఎందుకంటే ఫోన్​లో ఆయనతో మాట్లాడాను. నా భర్తను సంప్రదించి మా గురించిన సమాచారం ఆయనకు అందించే వారికోసం ఎదురుచూస్తున్నా." క్రిస్టినా మాచేట్, బాధితురాలు.

బైరాలో ఏర్పాటు చేసిన శిబిరాలు శరణార్థులతో నిండిపోయాయి. తుపాను ధాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. మంచినీరు, పారిశుద్ధ్యం పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details