తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు గ్రామాలపై ఉగ్రవాదుల దాడి- 20మంది మృతి! - అంతర్జాతీయ వార్తలు

తూర్పు కాంగోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇటురి రాష్ట్రంలో పునరావాస శిబిరాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

Congo news, కాంగో న్యూస్​
రెండు గ్రామాలపై ఉగ్రవాదుల దాడి

By

Published : Nov 23, 2021, 10:54 AM IST

Updated : Nov 23, 2021, 11:48 AM IST

తూర్పు కాంగో ఇటురి రాష్ట్రంలోని రెండు గ్రామాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పునరావాస శిబిరాలే లక్ష్యంగా తుపాకుల మోత మోగించారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మృతి చెందారని సైన్యం తెలిపింది. స్థానిక అధికారులు, కివు సెక్యూరిటీ ట్రాకర్​ మాత్రం మృతుల సంఖ్య 29 వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే ముందుగా 107 మంది మృతి చెంది ఉంటారని పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత సంఖ్యను సవరించింది.

డ్రోడ్రో, డోంగో గ్రామాల్లో జరిగిన ఈ దాడిలో 22 మృతదేహాలు లభించినట్లు స్థానిన నేత తెలిపారు. డ్రోడ్రోలోని క్యాథలిక్ చర్చి పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించారు. మృతదేహాలు వెలికితీసేందుకు వచ్చినవారు కూడా బుల్లెట్ల శబ్దాలు విని పారిపోయారని వివరించారు.

హింసకు భయపడి పారిపోతున్న 16,000 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించినట్లు కాంగోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ తెలిపింది. వీరికి ఐరాస శాంతిపరిరక్షకులు భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:బస్సులో చెలరేగిన మంటలు- 45 మంది సజీవదహనం!

Last Updated : Nov 23, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details