తెలంగాణ

telangana

ETV Bharat / international

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్​పై దుండగుడి దాడి - అవగాహన

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్​పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్​బర్గ్​లో ఈ ఘటన జరిగింది. తనపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసే ఆలోచన లేదని చెప్పారు ఆర్నాల్డ్.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్​పై దుండగుడి దాడి

By

Published : May 19, 2019, 1:20 PM IST

హాలీవుడ్ నటుడు, కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్​పై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్​బర్గ్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వెనుక నుంచి వచ్చి కాలితో తన్నాడు. శనివారం జరిగిన ఈ దాడిలో ఆర్నాల్డ్​ ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూలి పడబోయి... వెంటనే నిలదొక్కుకున్నారు. గమనించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దాడిపై స్పందిస్తూ 'అతడు నా స్నాప్​ చాట్​ను ఆపలేకపోయినందుకు సంతోషం' అని హాస్యోక్తి విసిరారు ఆర్నాల్డ్. తనకేమీ ప్రమాదం జరగలేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు. నిందితుడిపై ఫిర్యాదు చేసే ఆలోచన లేదని చెప్పారు.

'ఆర్నాల్డ్ క్లాసిక్ ఆఫ్రికా ఈవెంట్' లో ఈ సంఘటన జరిగింది. శరీర ధారుఢ్య అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్​పై దుండగుడి దాడి

ఇదీ చూడండి: 'విమానాలు కనపడకుండా పోతాయి జాగ్రత్త..!'

ABOUT THE AUTHOR

...view details