మధ్య ఆఫ్రికాలో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బురుండికి చెందిన శాంతి పరిరక్షకులపై దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో మగ్గురు శాంతి పరిరక్షకులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్య ఆఫ్రికాలోని డెకువా ప్రాంతంలో జరిగింది. శాంతి పరిరక్షకులపై దాడిని తీవ్రంగా ఖండించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలన్నారు.
ముగ్గురు శాంతి పరిరక్షకులను హతమార్చిన ఉగ్రవాదులు - ఐరాస
మధ్య ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి పరిరక్షకులపై దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో మగ్గురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ ఖండించారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలన్నారు.
ముగ్గురు శాంతి పరిరక్షకులను హతమార్చిన ఉగ్రవాదులు
అయితే ఉగ్రవాద సంస్థలు మంగళవారం స్వాధీనం చేసుకున్న బంబారీ నగరంలో ఐరాస కార్యకలాపాలు జరుపుతోంది.
ఇదీ చదవండి :దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా