శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి అహర్నశలు కృషి చేస్తున్నానని తెరాస అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్, గోపి నగర్ కాలనీలలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
నగరంలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల ద్వారా కోట్ల రూపాయలతో పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు తెలిపారు. డ్రైనేజీలు, తాగునీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యల పరిష్కారానికి చేస్తానని హామీ ఇచ్చారు.