తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

మత రాజకీయాలు కాదు.. అభివృద్ధిపై మాట్లాడాలి: కవిత - జీహెచ్ఎంసీ పోల్స్

మత రాజకీయాలు కాకుండా.. చేసిన అభివృద్ధిపై మాట్లాడాలని ఎమ్మెల్సీ కవిత భాజపా నేతలకు సవాల్​ విసిరారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్​, అడికిమెట్​లో పర్యటించారు.

mlc kavitha ghmc election campaign at gandhinagar in hyderabad
మత రాజకీయాలు కాదు.. అభివృద్ధిపై మాట్లాడాలి: కవిత

By

Published : Nov 28, 2020, 2:01 AM IST

ఎమ్మెల్సీ కవిత జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లోని గాంధీనగర్​, అడికిమెట్​లో పర్యటించారు. మత రాజకీయాలు కాకుండా భాజపా చేసిన అభివృద్ధిపై మాట్లాడాలని కమలం పార్టీ నేతలకు సవాల్​ విసిరారు. గత ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం హైదరాబాద్​లో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. కరోనా వచ్చినా.. వరదలు వచ్చినా.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు.

గాంధీనగర్ డివిజన్​ను ఎంతో అభివృద్ధి చేశామన్న కవిత.. తెరాస అభ్యర్థి ముఠా పద్మ గోపాల్​ను గెలిపించాలన్నారు. అనంతరం పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్, చేనేత సంక్షేమం కోసం భిక్షాటన చేసి 60 లక్షలు రుపాయలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు భరత్ భూషణ్​ను కవిత కలిసి పరామర్శించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ కవితతోపాటు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అభివృద్ధి వైపు ఉంటారా?.. అరాచకం వైపు ఉంటారా?: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details