తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

ట్రంప్ వచ్చి ప్రచారం చేసినా తమకు నష్టం లేదు: అసదుద్దీన్ - అసదుద్దీన్ ఒవైసీ వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ట్రంప్ వచ్చి ప్రచారం చేసినా తమకు నష్టం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్​లోని దబీర్పుర, ఆజమ్ పుర ,షేక్​పేట్, తలాబ్ చంచలంలో ప్రచారం నిర్వహించారు.

asaduddin ovaisi campaign in ghmce elections
ట్రంప్ వచ్చి ప్రచారం చేసినా తమకు నష్టం లేదు: అసదుద్దీన్

By

Published : Nov 29, 2020, 4:52 AM IST

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దబీర్పుర, ఆజమ్ పుర, షేక్​పేట్, తలాబ్ చంచలంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భాజపా నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ట్రంప్ మినహా అందరు వచ్చి వెళ్లారని ఎద్దేవా చేసిన ఒవైసీ అయినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ వచ్చి ప్రచారం చేసినా తమకు నష్టం లేదన్నారు.

అమెరికాలో అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రధాని ప్రచారం చేసినా అయన బోల్తా పడ్డారు విమర్శించారు. ఏ మంత్రి ప్రచారానికి వచ్చినా అసద్​ను జిన్నాతో పోల్చారని.. జిన్నాపై తనకంటే భాజపా వాళ్లకే ప్రేమ ఎక్కువని పేర్కొన్నారు. జిన్నా ప్రతిపాదనను ధిక్కరించిన వాళ్లే ఇండియాలో మిగిలి ఉన్నారనే స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు వ్యతిరేక ప్రచారమనే సరికి హైదరాబాద్​కు నాయకులు క్యూ కట్టారన్న ఒవైసీ.. సహాయం అడిగినప్పుడు మాత్రం ఏ ఒక్కరు కనిపించకుండా పోయారని ఆరోపించారు.

ఇదీ చదవండి:మజ్లిస్ చేతిలో తెరాస కీలుబొమ్మ :కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details