మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి
ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఏఎస్ రావ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకెళతానని హామీ ఇచ్చారు.
మళ్లీ నన్నే గెలిపిస్తారు : తెరాస అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఏఎస్ రావ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్లో ఇప్పటివరకు 110 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, రోడ్లు, థీమ్ పార్కులు, వాక్ వేలు, కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మరోసారి తనకు ప్రజలు అవకాశం ఇస్తారని నమ్మకం ఉందన్నారు. డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకెళతానని హామీ ఇచ్చారు.
TAGGED:
trs candidate