Yash KGF 2 dialogues: "వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్.. వైలెన్స్ లైక్స్ మీ".. ఇప్పుడు 'కేజీయఫ్' ప్రేమికులందరూ చెబుతున్న డైలాగ్ ఇది. యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సిద్ధమైన 'కేజీయఫ్-2'లోనిది ఈ పవర్‌ఫుల్ డైలాగ్. 'కేజీయఫ్'కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల విడుదలైన 'కేజీయఫ్-2' ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్.. ముఖ్యంగా హీరో చెప్పే డైలాగ్‌లు అందరితో ఈలలు వేయిస్తున్నాయి.
'కేజీఎఫ్ 2'లో ఆ డైలాగ్స్ హీరో యశ్ రాసినవే! - యశ్ కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్
Yash KGF 2 dialogues: 'కేజీఎఫ్ 2'లో తన పాత్రకు సంబంధించిన డైలాగ్‌లను హీరో యశ్ స్వయంగా రాసుకున్నారని తెలిపారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ చూసిన ఫుల్ జోష్‌లో ఉన్న యశ్ అభిమానులు ఈ మాట విని మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు 'కేజీయఫ్-2'కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యశ్ మెయిన్ రోల్ పోషించడమే కాకుండా తనలోని రైటింగ్ టాలెంట్‌ను బయటపెట్టారు. తన పాత్రకు సంబంధించిన పలు సంభాషణలను యశే రాసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రశాంత్‌నీల్ ఇంటర్వ్యూలో చెప్పారు. "కేజీయఫ్-2 ట్రైలర్ చూసిన చాలా మంది డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయని ముఖ్యంగా యశ్ సంభాషణలు అదిరిపోయాయని చెబుతున్నారు. అయితే, తన పాత్రకు సంబంధించిన చాలా డైలాగ్స్‌ను యశ్‌నే రాసుకున్నారు" అని ప్రశాంత్‌నీల్ చెప్పారు. దీంతో యశ్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది