తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ ఉచిత ప్రదర్శన.. ఆ థియేటర్లలోనే.. - Writer padmanabham review

సుహాస్ ‌హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన సినిమా రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్‌ మూవీటీమ్​ కీలక నిర్ణయం తీసుకుంది. హిళల కోసం ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది.

Writer padmanabham
రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ ఉచిత ప్రదర్శన.. ఆ థియేటర్లలోనే..

By

Published : Feb 7, 2023, 3:21 PM IST

నటుడు సుహాస్ ‌హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన సినిమా రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్‌. పోస్టర్లు, ట్రైలర్‌తోనే సినీప్రియులను ఆకర్షించిన ఈ చిత్రం రీసెంట్​గా రిలీజై ఫీల్‌ గుడ్‌ మూవీగా పాజిటివ్​ టాక్‌ దక్కించుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కథపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది. బుధవారం (ఫిబ్రవరి8) రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. దీని కోసం 38 థియేటర్లు ఎంపిక చేశారు.

మహేశ్‌ బాబు ప్రశంస..సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమా సినీప్రియుల మనసుల్ని హత్తుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన స్టార్‌ హీరో మహేశ్‌ బాబు కూడా చిత్రబృందాన్ని ప్రశంసించారు. సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేసినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని ఆయన పేర్కొన్నారు. సినిమాలో నటీనటులు చాలా బాగా నటించారని ప్రశంసిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. దీనికి సుహాస్‌ ‌ భావోద్వేగానికి గురవుతూ మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదీ చూడండి:షారుక్ లైనప్​.. మోత మోగేలా ఉందే!

ABOUT THE AUTHOR

...view details