తెలంగాణ

telangana

నయన్​ భర్త టీ-షర్ట్​పై ధోనీ ఆటోగ్రాఫ్​.. పసిపిల్లాడిలా శివన్​ ఎమోషనల్​!

By

Published : Jul 12, 2023, 9:43 PM IST

Dhoni Vignesh Shivan : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ఎం.ఎస్​ ధోనీ చెన్నైలో సందడి చేశారు. తాను నిర్మించిన సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చెన్నైలో పర్యటిస్తున్న ఆయన నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను కలిసి ముచ్చటించారు. అనంతరం ఆయన టీ-షర్టుపై ఆటోగ్రాఫ్​ ఇచ్చి ఆయన్ను ఖుషీ చేశారు.

Watch: Vignesh Shivan shares fanboy moment as he gets t-shirt signed by MS Dhoni, pens heartfelt note for his 'hero'
స్టార్​ హీరోయిన్​ భర్త టీ-షర్ట్​పై ధోనీ ఆటోగ్రాఫ్​.. పసిపిల్లాడిలా ఎమోషనల్​.. వీడియో వైరల్​..

Dhoni Vignesh Shivan : టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ సొంత ప్రొడక్షన్​ హౌస్​ అయిన ధోనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై తెరకెక్కిన తొలి సినిమా 'LGM' (లెట్స్​ గెట్​ మ్యారీడ్​). ఈ సినిమాను తమిళంలో నిర్మించారు ధోనీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగానే చెన్నైలో పర్యటిస్తూ బిజీగా గడుపుతున్నారు మిస్టర్​ కూల్​. ఈ సందర్భంగా కోలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను కలిసి ఆయనతో ముచ్చటించారు.

పసిపిల్లాడిలా మారిన విఘ్నేశ్​..
Dhoni Autograph T Shirt : ధోనీకి విఘ్నేశ్​ వీరాభిమాని. ఓ ఆరాధ్య దైవంలా ధోనీని భావిస్తారు ఆయన! ఇంకేముంది అంతలా ఆరాధించే వ్యక్తే స్వయంగా తన దగ్గరకు రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోనీని చూసిన ఆనందంలో విఘ్నేశ్​ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ను చూసి ఓ చిన్నపిల్లాడిలా మారి ఉన్నచోటే మోకరిల్లారు. ధోనీ కూడా అక్కడే ఉన్న ఓ సోఫాపై కూర్చున్నారు.

విఘ్నేశ్​ తాను ధరించిన తెల్లని టీ-షర్టుపై ధోనీ ఆటోగ్రాఫ్​ను అడిగి మరీ పెట్టించుకున్నారు. అంతేకాకుండా ధోనీ చేతులు పట్టుకొని కాస్త ఎమోషనల్​గా ఫీలయ్యారు. అనంతరం ఆయన చేతులపై ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్​ తన ఇన్​స్టా హ్యాండిల్​లో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అటు క్రికెట్​ అభిమానులతో పాటు సినీ లవర్స్​ను కూడా అట్రాక్ట్​ చేస్తోంది.

"నా హీరోతో, నా కెప్టెన్​తో, నా రోల్​ మోడల్​తో. ఇలాంటి కల్మశం లేని వ్యక్తిని కలవడం నన్ను ఎప్పుడూ ఎమోషనల్​కు గురిచేస్తోంది. నేను ప్రేమించే, ప్రతిరోజు కలవాలనుకునే వ్యక్తే నా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఆయన్ను చూసిన ప్రతిసారి నా ముఖంలో వచ్చే ఆనందాన్ని చూసి మరింత సంతోష పడుతుంటాను" అంటూ తన ఆరాధ్య దైవం తన ముందుకు వస్తే ఎలా స్పందిస్తారో ఆ విధంగా రియాక్ట్​ అయ్యారు కోలీవుడ్​ డైరెక్టర్​ విఘ్నేశ్​.

ఠధోనీ తన మొదటి సినిమాను అది కూడా తమిళంలో తీయడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై ఆయన తీసే ప్రతి సినిమాకు మా లవ్​ అండ్​ సపోర్ట్​ కచ్చితంగా ఉంటుంది. థ్యాంక్యూ సాక్షిసింగ్​ మేడమ్​.. వెలకమ్​ టు ది తమిళ్​ సినిమఠ అంటూ ధోనీ భార్యకు విషెస్​ చెప్పారు విఘ్నేశ్. అయితే ధోనీ, విఘ్నశ్​లు కలుసుకోవడం ఓ కొత్త చర్చకు దారి తీసింది. విఘ్నేశ్-​ ధోనీ కలిసి సినిమా తీస్తారని ఫ్యాన్స్​ కామెంట్స్​ పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details