Vishwak Sen Arjun: విశ్వక్‌సేన్ వ్యవహారశైలి అన్‌ప్రొఫెషనలిజమంటూ సీనియర్ నటుడు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. విశ్వక్‌కు నిబద్ధత లేదంటూ అర్జున్ కాస్త గట్టిగానే మాట్లాడారు. తనలా మరో నిర్మాతకు జరగకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కథానాయకుడు విశ్వక్‌సేన్ కూడా స్పందించారు.
'నా మాటకు సెట్‌లో గౌరవం లేదు.. మనీ చెక్‌లు, డాక్యుమెంట్లు పంపించేశా' - విశ్వక్ సేన్ అర్జున్
సీనియర్ నటుడు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. ఏమన్నారంటే?
సంభాషణలు, పాటలు, మ్యూజిక్ విషయంలో తాను సూచనలు చేసిన మాట వాస్తవమేనని విశ్వక్ సేన్ చెప్పారు. ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని, తాను చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారని విశ్వక్ తెలిపారు. తన మాటకు సెట్‌లో అస్సలు గౌరవం ఉండదని చెప్పారు. అందుకే తన మనసుకు నచ్చని పని చేయలేక, సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. తాజా సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, చెక్‌లు, డ్యాకుమెంట్‌లు నిర్మాతల మండలికి పంపినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:విశ్వక్‌సేన్.. కమిట్‌మెంట్ లేని నటుడు.. ఇది నిజంగా అవమానమే!: అర్జున్ అసహనం