Sai Pallavi: 'నీది నాది ఒకే కథ' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల. 'వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు' అని చెప్తుండే ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం 'విరాటపర్వం'. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా వేణు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి, నాయకానాయికల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. వాటిల్లోని కొన్ని సంగతులివీ..
- విరాటపర్వం ఎలా ఉండబోతుంది?
వేణు: 90ల నాటి కథ ఇది. గాఢమైన ప్రేమ, రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. మనకు బాగా కావాల్సిన వారు చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమాలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
- ఈ సినిమాలో నక్సలిజాన్ని చూపించినట్టున్నారు? మీ తొలి చిత్రంలోనూ సామాజికాంశాలను ప్రస్తావించారు?
వేణు: అలాంటి సమాజంలోనే నేను పుట్టి, పెరిగా. మాది వరంగల్. అక్కడి సమస్యలు, విప్లవాలు నాకో భిన్నమైన దారిని చూపాయి. దీంతోపాటు నేను చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావమూ సినిమాపై పడుండొచ్చు.
- ఈ సినిమా కోసం నక్సలైట్ల గురించి రీసెర్చ్ చేశారా?
వేణు:లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు, నక్సల్స్ జీవితాలు ఎలా ఉంటాయో బాల్యం నుంచే నాకు అనుభవం ఉంది. మా ఇంట్లో నుంచి చూస్తుంటే నక్సల్స్, పోలీసుల ఎన్‌కౌంటర్లు కనిపిస్తుండేవి. వాటికి నేను పత్యక్ష సాక్షిని. అందుకే ఈ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు.
- ఎవరిని దృష్టిలో పెట్టుకుని రానా పాత్రను సృష్టించారు?
వేణు: నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని రానా పాత్రను రాశా. పాత్ర పేరు 'రవన్న' అని పెట్టా.
- ఈ క్యారెక్టర్‌కు రానానే తీసుకోవడానికి కారణమేంటి? ఇంకా ఎవరినైనా సంప్రదించారా?