తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'విక్రమ్​'.. కమల్​కు రూ.50కోట్లు!, విజయ్​, ఫహద్​కు ఎంతంటే? - విక్రమ్​ సూర్య​ రెమ్యునరేషన్​

Vikram movie actors remeuneration: కమల్​హాసన్​, విజయ్​సేతుపతి, ఫహద్​ ఫాజిల్​, సూర్య కలిసి నటించిన విక్రమ్​ సినిమా సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తూ మంచి కలెక్షన్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ హీరోల రెమ్యునరేషన్​ ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. ​ఓ సారి ఆ వివరాలను తెలుసుకుందాం..

vikram movie actor remuneration
విక్రమ్​ రెమ్యునరేషన్​

By

Published : Jun 4, 2022, 4:24 PM IST

Vikram movie actors remeuneration: యూనివర్సల్ స్టార్​ క​మల్‌హాసన్‌ నటించిన తాజా చిత్రం 'విక్రమ్‌'. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, హీరో సూర్య కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే అందుకు కారణం. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలై సూపర్​హిట్​ టాక్​ను అందుకుంది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఒకేసారి ఇంతమంది స్టార్​లు ఈ చిత్రంలో నటించడం వల్ల వీళ్ల రెమ్యునరేషన్​ ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120కోట్ల బడ్జెట్​తో తెరకెక్కినట్లు సమాచారం. కమల్​హాసన్​ అత్యధికంగా రూ.50కోట్లు పారితోషికం తీసుకోగా.. దర్శకుడు లోకేష్​ రూ.8కోట్లు తీసుకున్నారని వినికిడి. ఇక విజయ్​ సేతుపతి రూ.10కోట్లు, ఫహద్​ రూ.4కోట్లు, మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రూ.4కోట్లు రెమ్యునరేషన్​ తీసుకున్నారట. హీరో సూర్య పారితోషికంపై స్పష్టత లేదు. ఇక ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్‌. దాదాపు రూ.200 కోట్లకు డీల్‌ ముగిసిందట.

ఇదీ చూడండి: 'మేజర్' టీమ్​​ కీలక ప్రకటన.. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం

ABOUT THE AUTHOR

...view details