తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్​ దేవరకొండ రికార్డ్​, ప్రభాస్​ మహేశ్ పవన్​ను మించేశాడుగా - విజయ్​ దేవరకొండ లైగర్​ మూవీ థియేటర్స్​

Vijay devarkonda Liger record విజయ్​దేవరకొండ నటించిన కొత్త చిత్రం లైగర్. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ​ ఓ రికార్డు సాధించింది. అదేంటంటే.

vijaydevarkonda
విజయ్​దేవరకొండ

By

Published : Aug 24, 2022, 12:46 PM IST

Vijay devarkonda Liger shows record సాధారణంగా సినిమా రిలీజ్​ విషయంలో స్టార్​ హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోంది? ఎన్ని స్క్రీన్స్​లో ఎక్కడెక్కడ ప్రదర్శన అవుతోంది? అంటూ చర్చలు కూడా జరుగుతుంటాయి. అయితే తాజాగా రౌడీహీరో విజయ్ దేవరకొండ సినిమా.. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్​ సినిమాల కన్నా ఎక్కువ స్క్రీన్స్​లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు..

విజయ్​ దేవరకొండ నటించిన లైగర్​ ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్​ కానుంది. అయితే ఈ మూవీ బెంగళూరులో ఓ రికార్డు సాధించింది. అంతకుముందు ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్​కు లేనంతగా ఏకంగా 630కు పైగా స్క్రీన్లలో ప్రదర్శన అవ్వబోతుందని తెలిసింది. అంతకుముందు ఆచార్య 400, భీమ్లానాయక్​ 380, సర్కారు వారి పాట 591, రాధేశ్యామ్​ 525 స్క్రీన్స్​లో రిలీజ్​ అయింది. అయితే ఆర్​ఆర్​ఆర్​పై క్లారిటీ లేదు. ఇది లైగర్​ కన్నా ఎక్కువ స్క్రీన్స్​లో రిలీజ్​ అయి ఉండొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఆర్​ఆర్​ఆర్​ 10,300, బాహుబలి 9 వేలు, సాహో 8 వేలు, రాధేశ్యామ్​ 7వేలకు పైగా, సైరా 4650, బాహుబలి ఫస్ట్ పార్ట్​​ 4వేలు, పుష్ప 3వేలకు పైగా​, అజ్ఞాతవాసి 2800కుపైగా​, సర్దార్​ 2600కు పైగా థియేటర్లలో రిలీజ్​ అయ్యాయి. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన లైగర్​ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటించింది. రమ్యకృష్ణ, గెటప్‌ శ్రీను, విష్ణురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

ఇదీ చూడండి: నిహారికతో విజయ్ ​దేవరకొండ లైగర్​ ఫైట్, వీడియో అదిరింది

ABOUT THE AUTHOR

...view details