తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్​-సమంత 'ఖుషి' రిలీజ్ డేట్ ఫిక్స్​.. కూల్​గా కొత్త పోస్ట​ర్​ - విజయ్ దేవరకొండ సమంత ఖుషి రిలీజ్ డేట్​

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్​ సమంత కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమా 'ఖుషి'. తాజాగా ఈ మూవీ రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. ఆ వివరాలు..

.
.

By

Published : Mar 23, 2023, 4:06 PM IST

Updated : Mar 23, 2023, 4:40 PM IST

సెన్సేషనల్​ స్టార్​, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ-హీరోయిన్​ సమంత రూత్​ ప్రభు కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమా 'ఖుషి'. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేం దర్శకుడు శివ‌ నిర్వాణ.. ఈ చిత్రాన్ని డైరెక్ట్​ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది మూవీటీమ్​. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పాన్​ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్​ చేయనుట్లు పేర్కొంది. ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఏంతో కూల్​గా ఉన్న ఈ పోస్టర్​లో విజయ్‌ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై పెట్‌ను ఎత్తుకొని ఉన్న సమంతకు బై చెప్తున్న స్టిల్​ను పోస్ట్ చేసింది. ఇది అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతోంది.

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం'.. ముఖ్యంగా 'డియర్​ కామ్రెడ్​' చిత్రాలతో విజయ్ దేవరకొండ.. నార్త్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్​ను దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన 'లైగర్'.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్​గా నిలిచింది. కానీ రౌడీహీరోకు మాత్రం మరింత క్రేజ్​ను తెచ్చిపెట్టింది. అలాగే 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్​తో నార్త్​ ఆడియెన్స్​కు దగ్గరయ్యారు. ఆ తర్వాత పుష్ప ఊ అంటావా సాంగ్​, సహా 'యశోద' సక్సెస్​తో బాలీవుడ్​లో ఫుల్ క్రేజ్​ను సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల ఇండియా వైడ్​గా 'ఖుషి' సినిమాకు మంచి క్రేజ్​ నెలకొంది.

ఇకపోతే.. మయో సైటిస్​తో బాధపడుతున్న సమంత.. ఆ మధ్యలో షూటింగ్​లకు కాస్త చిన్న బ్రేక్​ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలలో పాల్గొంటుంతోంది. ప్రస్తుతం 'ఖుషి' మూవీ చిత్రీకరణ హైదరాబాద్​లోనే జరుగుతోంది. కశ్మీర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంకా ఈ లవ్​స్టోరీ సినిమాలో ఫైట్స్ కూడా ఉన్నాయట. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో వీటిని చిత్రీకరిస్తున్నారు. మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్​ హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా ఈ మూవీలో మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, జయరామ్, మురళీ శర్మ, అలీ, లక్ష్మీ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, శరణ్య ప్రదీప్ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్నారు.

విజయ్​ దేవరకొండ- సమంత 'ఖుషి' రిలీజ్ డేట్ ఫిక్స్

ఇదీ చూడండి:సామ్​ 'శాకుంతలం' కోసం అంత బంగారం వాడారా.. వామ్మో ఎన్ని కోట్లో?

Last Updated : Mar 23, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details